గర్భిణి స్త్రీలకు అవగాహన కార్యక్రమం

షాబాద్ : హెల్త్ వీక్ లో భాగంగా షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నవనీత స్వామి, వైద్యాధికారితో కలిసి సేఫ్ మదర్ వుడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా గర్భిణీ సంరక్షణ (ANC) ఉన్నవారికి, అధిక ప్రమాదం ఉన్న కేసులకు సురక్షిత మాతృత్వ పద్ధతులు,  తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీహరి, వెంకటేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 Save & Share image
Call Now Button